కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మండల, పంచాయతీలు వారిగా ఉన్న నిధుల వివరాలను అధికారులను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి సత్వరం ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.