అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కందుకూరు పట్టణంలోని వెంకటనారాయణ బజార్ లో గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద శనివారం వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.