ఒంగోలు నగరంలోని పోతురాజు కాలువను త్వరగా ఆధునీకరించాలని నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వరరావుకు సోమవారం ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ విజ్ఞప్తి చేశారు. కాలువ ఆధునీకరణ పనులు గతంలో మొదలు పెట్టి 20% మాత్రమే చేశారన్నారు. చాలా చోట్ల పాడైపోయాయని అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరారు.