వినాయక చవితి నవరాత్రులను సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని టిడిపి నాయకుడు, మార్కాపురం పట్టణ 33 వ వార్డు కౌన్సిలర్ నాలి కొండయ్య యాదవ్ ఆకాంక్షించారు. శనివారం వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఆయన పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను ఉత్సాహభరిత వాతావరణం లో జరుపుకుందామని ఈ సందర్భంగా ఆయన వినాయక మండప నిర్వాహకులను ఉద్దేశించి అన్నారు.