కనిగిరి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానని మున్సిపల్ చైర్మన్ షేక్. అబ్దుల్ గఫూర్ తెలిపారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు పాపిరెడ్డి నగర్ లో బుధవారం మున్సిపల్ చైర్మన్ పర్యటించారు. కాలనీలో చిల్లచెట్ల తొలగింపు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. శివారు కాలనీల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ ఏఈ కోటేశ్వర రావు పాల్గొన్నారు.