పల్లె పల్లెనా ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో అభివృద్ధిని చూస్తారని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా గొట్టిపాటి లక్ష్మి మంగళవారం దర్శి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా సామంతపూడి గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.