జిల్లాలోని భూసమస్య లకు శాశ్వత పరిష్కారం కోసమే గ్రామసభలను నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. బుధవారం పార్వతీపురం మండలంలోని లక్ష్మీనారాయణ పురంలో జరిగిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. గ్రామసభకు విచ్చేసిన భూహక్కు దారుల పాసు పుస్తకాలు, రెవిన్యూ రికార్డులు, సవరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.