జిల్లాలో పిఎంఈజిపి కింద ప్రతి మండలంలో ఒక యూనిట్ ప్రారంభం కావాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రానున్న 15 రోజుల్లో యూనిట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. స్థిర ఆదాయం వచ్చే నూతన యూనిట్లను స్థాపించి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చూడాలని అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జిల్లాలో జీవన ఉపాధిలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.