మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ-బి గ్రామం స్టాక్ పాయింట్ గా ఇసుక సరఫరా ప్రారంభమైందని ఆదివారం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్. వి. మాధవరెడ్డి పేర్కొన్నారు. అక్రమ రవాణాకు తావులేకుండా పారదర్శకంగా ఇసుక పంపిణీ చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ మేరకు ఆదివారం విలేకరుల సమావేశంలో కలెక్టర్, ఎస్పీ ఇసుక సరఫరాపై వివరాలు వెల్లడించారు.