చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండల కేంద్రంలో డయేరియా వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న రోగులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బుధవారం పరామర్శించారు. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, డయేరియా అదుపులోనే ఉందని తెలిపారు. త్రాగునీటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి క్లోరినేటెడ్ వాటర్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్ ఓ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.