బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కష్టాల్లో మేము ఉన్నామని భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. అచ్యుతాపురం ఘటనలో మృతి చెందిన పార్థసారథి కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. శుక్రవారం ఆరు గంటలకి ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ ఆర్థిక సహాయంగా కోటి రూపాయల చెక్కు అందజేశారు. ఇంటికి ఆధారమైన అందికొచ్చిన కొడుకును కోల్పోవడం బాధాకరమని ఆయన తన సంతాపం వ్యక్తం చేశారు.