ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైమరీ టీచర్స్ కు ఓటు హక్కు కల్పించాలని ఎస్ జి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకల చంద్రరావు కోరారు. శుక్రవారం ఆయన గజపతినగరంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎన్నికల్లో ఓటు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం హర్ష నియమన్నారు. ఏపీలో కూడా ఓటు హక్కు కోసం ఎన్నో ఏళ్లగా తమ సంఘం పోరాటం చేస్తున్నదని తెలిపారు. తక్షణమే ఓటు హక్కు కల్పించాలని కోరారు.