బొబ్బిలి నియోజకవర్గ కాపు, బలిజ సేన అధ్యక్షుడిగా నంది హరి ప్రకాశ్ నియమితులయ్యారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం ప్రకారం. నంది హరి ప్రకాష్ ను నియమిస్తూ కాపు, బలిజ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బలిజ సంక్షేమ సేన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని సూర్య ప్రకాశ్ ఈ సందర్భంగా తెలియజేశారు. హరిరామ జోగయ్య కు నంది హరి ప్రకాష్ ధన్యవాదములు తెలిపారు.