తిరుమలలో మరోసారి పరకామణి కుంభకోణం చర్చ

59பார்த்தது
తిరుమలలో మరోసారి పరకామణి కుంభకోణం చర్చ
AP: తిరుమలలో పరకామణి కుంభకోణం మరోసారి రచ్చ రేపుతోంది. పెద్దజీయర్ మఠం ఉద్యోగి సీవీ.రవికుమార్ పరకామణి నుంచి కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ తరలించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అతని దగ్గర రూ.78 వేల విలువైన డాలర్లు దొరికాయని పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ అధికారి అతనితో లోక్ అదాలత్‌లో రాజీ పడటం చర్చనీయాంశంగా మారింది. దాంతో టీడీపీ నేత భాను ప్రకార్ రెడ్డి దీనిపై కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி