కుల మత బేదాలకు అంతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి సావిత్రిబాయి పూలే అని జనసేన పార్టీ సీనియర్ నేత, కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. ఆమె జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక మినీ బైపాస్ లో ఉన్న జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్, కిషోర్ గునుకుల తదితరులు పాల్గొన్నారు.