నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం పగల్ పత్తు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 4వ ఉత్సవం శ్రీ రాజమన్నార్ అవతారంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ రంగనాధ స్వామి కనివిందు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆలయ ఈఓ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, దేవస్థాన చైర్మెన్ మంచికంటి శ్రీనివాసులు ధర్మకర్తల మండలి సభ్యులు వీరెపల్లి పద్మజ మ్, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.