నెల్లూరు క్లబ్ షటిల్ బ్యాట్మెంటన్ పోటీల్లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా నెల్లూరు క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలకు ట్రోఫీలతో పాటు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు క్లబ్ అధ్యక్షులు కొండేటి శివారెడ్డి ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.