నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావుకు మరోసారి రాజ్యసభ అవకాశం కల్పించారు. టిడిపి అధిష్టానం అధికారికంగా సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. వైసీపీ తరఫున ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నికై ఇటీవల తన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్యసభలో మూడు ఖాళీలు ఏర్పడడంతో నెల్లూరుకు చెందిన బీదా మస్తాన్ రావుకు అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.