నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్, బీవీనగర్ లో 1 కోటి 20 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ సూర్యతేజ, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బుధవారం శంఖుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జనవరి నెలాఖరుకల్లా గుంటలు లేని రహదారులను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు.