ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జుడీషరీ డైరెక్టర్ అవధానం హరిహర నాథ శర్మ ఆదివారం ఉదయం జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి అతిధులకు స్వాగత ఏర్పాట్లు చేయించి దర్శనం కల్పించారు. ఆలయ అర్చకులు అతిధులను శేష వస్త్రములతో సత్కరించి వేద ఆశీర్వచనం తీర్థ ప్రసా అందజేశారు.