కందుకూరు మండలం చాకిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రికార్డులు పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఆరోగ్య కేంద్రంలో ఉండాలని వైద్యులకు, సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. ఏ ఒక్కరు కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదన్నారు.