కందుకూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు మునిసిపల్ అధికారులు, సిబ్బందితో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో వాటర్ ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేయుటకు కొనుగోలు చేసిన నూతన ట్రాక్టర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొర్రపాటి అనూష, మున్సిపల్ డిఈ గణపతి, అన్ని విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.