కందుకూరు నియోజకవర్గంలో లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్ట్ కుడికాలువ గేటు వద్ద ఏర్పాటుచేసిన మోటార్ల ను బుధవారం సాయంత్రం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ఎన్ని క్యూసెక్కుల నీరు కాలువల ద్వారా దిగువ ఆయకట్టుకు ప్రవహిస్తుందో తెలుసుకున్నారు. కాలువలో నీరు ప్రవహిస్తున్న తీరును పరిశీలించారు.