కందుకూరు నియోజకవర్గం కాపు జేఏసీ యూత్ అధ్యక్షునిగా సాకిరి సాయి చందు నాయుడును ఎంపిక చేసినట్లు కాపు జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా సాకిరి సాయి చందు శుక్రవారం మాట్లాడుతూ కందుకూరు పట్టణానికి చెందిన తనను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాపు సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కాపు రాజ్యాధికారం కోసం వంగవీటి మోహనరంగా ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతాను అన్నారు.