కర్నూలు జిల్లాలో దారుణం.. భార్యను చంపిన భర్త
గోనెగండ్ల మండలం కులుమాల గ్రామంలో ఆదివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్య కృష్ణవేణి (27)ని భర్త పక్కీరప్ప రాయితో కొట్టి హత్య చేసినట్లు సోమవారం గోనెగండ్ల సీఐ గంగాధర్ తెలిపారు. కృష్ణవేణి, పకీరప్పకు 7 ఏళ్ల క్రితం వివాహం అయింది. పండుగ సందర్భంగా మద్యం తాగడానికి భార్యను డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో కోపంతో రాయితో కొట్టడంతో మృతి చెందినట్లు వెల్లడించారు.