ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో 8వ రోజు దీక్షను కొనసాగించాయి ప్రజా సంఘాలు. దళిత మహిళ గోవిందమ్మ ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు మద్దతుగా బుధవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగింది దీక్ష. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న గోవిందమ్మకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని మాల మహానాడు నాయకుడు నరసన్న భావోద్వేగానికి లోనై నువ్వు ప్రాణాలకు తిరిగి రావాలమ్మా అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.