కల్లుకుంటలో అమానవీయ ఘటనకు చస్తూ.. బతుకుతున్న గోవిందమ్మ ఎమ్మిగనూరు పట్టణంలో శుక్రవారం మూడవరోజు దీక్షలో పాల్గొన్నారు. అనంతరం గోవిందమ్మ మాట్లాడుతూ.. కల్లుకుంట బీసీ కులస్తులు అందరూ ఐక్యమై నన్ను వివస్త్రను చేసి, గ్రామ నడివీధులలో త్రిప్పుతూ, కరెంటు స్తంభానికి కట్టివేసి, నన్ను శారీరకంగా కొడుతూ, అమానవీయంగా హింసించారన్నారు. పోలీసు అధికారులు నా కేసును నిర్లక్ష్యం చేయడం, చాలా దారుణమని గోవిందమ్మ మండిపడ్డారు.