చరిత్ర సృష్టించిన​ స్పేస్​ఎక్స్‌- లాంచ్ ప్యాడ్ వద్దకే రాకెట్ బూస్టర్ (వీడియో)

66பார்த்தது
ఎలాన్​ మస్క్​కు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్​ఎక్స్​ మరో ఘనత సాధించింది. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ బూస్టర్‌ను తిరిగి లాంచ్‌ప్యాడ్‌ వద్దకే సురక్షితంగా చేర్చి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ఒక రాకెట్‌కు చెందిన బూస్టర్‌ను తిరిగి లాంచ్‌ ప్యాడ్‌ వద్దకు తీసుకురావడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అతిపెద్దదైన 'స్టార్‌షిప్‌' మెగా రాకెట్‌ను స్పేస్​లోకి పంపించారు. ఆదివారం టెక్సస్‌ తీరంలో ఈ ప్రయోగం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி