ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దారుణ సంఘటన జరిగింది. చిన్హాట్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మల విసర్జనకు వెళ్లిన బాలిక ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు చుట్టూ వెతికారు. చివరికి ఆమె అపస్మారక స్థితిలో పొలంలో పడి ఉండడాన్ని గమనించారు. ఆమె మెడకు కండువా బిగించి ఉంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారు.