ఎమ్మిగనూరు:నూతన సీఐగా శ్రీనివాసులు బాధ్యతలు
నూతన సిఐగా వి. శ్రీనివాసులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కాపాడుతానన్నారు. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించేవారి సమాచారం తనకు అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.