కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి

64பார்த்தது
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మిగనూరు మండల కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మండల ఆఫీసర్ శేషపానికి వినతి పత్రం అందజేశారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఏసు మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను మరవడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி