చేనేత కార్మికులను ఆదుకోవడంలో పాలక ప్రభుత్వాన్ని వైఫల్యం చెందుతున్నాయని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే.రాజు ఆరోపించారు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని సుందరయ్య భవన్ లో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పట్టణ నాయకులు కే. లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కే.రాజు మాట్లాడుతూ.. చేనేత కార్మికులు పని లేక ఇతర వృత్తులకు వెళ్తున్నారన్నారు. పవర్ లూమ్ తో పోటీ తట్టుకోలేకపోతున్నారు. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు అందజేయాలని, గుర్తింపు కార్డు లేని వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు.