కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మిగనూరు బస్టాండ్లో నిరసన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాంపుల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడిచిపోయిన నేటికీ సూపర్ సిక్స్ అమలు చేయలేదని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.