నకిలీ ఆర్ఎస్ఐగా చెప్పుకుంటూ వివిధ దందాలకు పాల్పడుతున్న వరంగల్ కు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు శ్రీశైలం సీఐ ప్రసాదరావు తెలిపారు. సెప్టెంబర్ 1న ప్రశాంత్ అనే వ్యక్తి శ్రీశైల క్షేత్రంలో తాను ఆర్ఎస్ఐనని, తనకు ప్రోటోకాల్ దర్శనం, రూమ్ కావాలని అడిగినట్లు పేర్కొన్నారు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి విచారిస్తే అసలు విషయం బయటపడిందని సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు.