పెద్దకడబూరు మండలంలోని తారాపురం గ్రామంలో వెలసిన శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం ఆలయ అధికారి రాంప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏప్రిల్ నుండి సెప్టెంబరు నెల వరకు మొత్తం ఆరు నెలల స్వామివారి హుండీని భ్రమరాంబ సేవా సమితి వారిచే లెక్కించారు. ఇందులో దేవాదాయ శాఖ ఇన్ స్పెక్టర్ సుబ్బారాయుడు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.