గ్రామాల్లో నెలకొన్న ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గులు దస్తగిరి తెలిపారు. బుధవారం గూడూరులో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పీఆర్ డీఈఈ కర్రెన్న, తహసీల్దార్ రామాంజినేయులు, ఎంపీడీవో శివనాగప్రసాద్ ఉన్నారు.