ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్అహ్మద్ ఆదివారం చాలెంజ్ విసిరారు. ఎంహెచ్పిఎస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ. ఎన్నో సందర్భాల్లో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిది అవినీతి చిట్టా విపపుతా అని అన్నారని. తక్షణమే ఆమాట నిలుబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మాటలకే పరిమితం కాకుండా క్రియల్లో చూపించాలని, మాజీ ఎమ్మెల్యే అవినీతి చిట్టా తెలిపితే. అది మైనార్టీ హక్కుల పరీక్ష సమితి, ఆదోని ప్రజల విజయం అవుతుందని చొప్పుకొచ్చారు.