ర్యాగింగ్ కు విద్యార్థులు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని మహానంది ఎస్సై ఎన్. రామ్మోహన్ రెడ్డి సూచించారు. శనివారం మహానంది ఫారంలోని ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సును కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్. జయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ తల్లి దండ్రుల ఆశయ సాధనకోసం చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.