ప్రతి పల్లెలో ప్రజలకు వసతులు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని పేర్కొన్నారు. గురువారం మహానంది మండలం నందిపల్లె గ్రామంలో రూ. 8, 50, 000, సీతారామాపురం గ్రామంలో 10, 00, 000 నిధులతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహబూబ్ దౌలా, ఈవోఆర్డి నాగేంద్రుడు, ఏపీఓ మనోహర్, పీఆర్ ఏఈ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.