పేద ప్రజల కడుపు నింపడానికే రాష్ట్రవ్యాప్తంగా సేవ దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్న క్యాంటీన్ ద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని ఐదు రూపాయలకే అందించడం ఇది పేద ప్రజలకు ఎంతో మేలు కలగజేస్తుందని నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ అన్నారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోనే అన్న క్యాంటీన్ సముదాయాన్ని మున్సిపల్ కమిషనర్ ఎస్ బేబీ, వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని సందర్శించి పరిశీలించారు.