ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం శనివారం కర్నాటక ఆహార శాఖ మంత్రి మునియప్ప,వెనకబడిన తరగతులు,సంక్షేమ కన్నడ సంస్కృతి,కొప్పల్ ఇన్ చార్జ్ మంత్రి శివరాజ్ తంగడిగి వేరువేరు సమయాల్లో వచ్చారు. వారికి మఠం సహయ మేనేజర్ ఐపి నరసింహస్వామి,వ్యాసరాజాచార్ లు స్వాగతం పలికారు.ముందుగా వారు గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు.