ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ద్వాదశి పూజలు ఘనంగా జరిగాయి.ఆదివారం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థలు ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్నికి విశేష పంచామృతాభిషేకం,తులసి అర్చన,ఉత్సవ రాయల పాద పూజ, కనక మహా పూజ, సుప్రభాత సేవ, పాద నిర్మల్య అభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.