ఆదోని పట్టణ శివారులో ఉన్న ఎస్సీ బాలుర కళాశాల వసతి గృహాన్ని తక్షణమే వేరే భవనానికి మార్చాలని గురువారం ఎస్ఎఫ్ఎ నాయకుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు వినతి పత్రం అందజేశారు. శిథిలావస్థకు చేరిన భవనం కాబట్టి అధికారులు స్పందించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.