రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులు భయపడే విధంగా ఓట్లు నమోదు చేయించి ఎన్డీయే అభ్యర్ధులని భారీ మెజార్టీతో గెలిపించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గురువారం విజయవాడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.