కంకిపాడు మండలంలోని దావులూరు బి ఆర్ కె స్పిరిట్స్, గొడవర్రు బివిఎస్ డిస్టలరీస్ లిక్కర్ కంపెనీలలో సిఐడి అధికారులు మంగళవారం విస్తృతంగా సోదాలు చేశారు. గత ప్రభుత్వ హయంలో దావులూరు, గొడవర్రు కంపెనీల నుంచి జరిగిన లిక్కర్ సరఫరా, అమ్మకాలు, మద్యం నాణ్యతపై సిఐడి బృందం ఆరా తీశారు. డీఎస్పీ స్థాయి అధికారుల సమక్షంలో దాదాపు 7 గంటలకు పైగా కంపెనీలలో సోదాలు నిర్వహించారు.