ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో కానూరులోని ఫెడరల్ స్కిల్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్లో అకౌంట్ టాలీ 30 రోజుల పాటు ఇచ్చే ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకా శాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.