నూజివీడు డిఎస్పీగా కిలాని వరప్రసాద్ యాదవ్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు డిఎస్పి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నూజివీడు సబ్ డివిజన్ పరిధిలోని శాంతిభద్రతలు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.