రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గురువారం ముసునూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత పథకం కింద మండలంలోని తమ్మిలేరు పరివాహ ప్రాంతాల్లో ఉచిత ఇసుక పథకాన్ని మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. వలసపల్లి బలివే ఎల్లాపురం గ్రామాల్లోని ఇసుక ర్యాంపుల్లో ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభిస్తారని సమాచార శాఖ అధికారులు తెలిపారు.