ఏలూరు జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమయ్యింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి మద్యం షాపుల ఆన్ లైన్, ఆఫ్ లైన్ దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. అమావాస్య కావడంతో మద్యం టెండర్లు సమర్పించేందుకు ఎవరూ పెద్ద ఆసక్తి
చూపించలేదు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 2 టెండర్లు వేసినట్లు మద్య నిషేధ, అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్ బీ. శ్రీలత తెలిపారు. కైకలూరులో ఈ రెండు టెండర్లు వేసినట్లు తెలిసింది.