కైకలూరు మండలంలోని కొల్లేటికోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మవారి దేవాలయం దసరా నవరాత్రి ఉత్సవాల భాగంగా భక్తులతో కిటికీటలాడింది. గురువారం ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు కుంకుమ పూజలు నిర్వహించారు. మొదటి రోజు కావడం తొ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈవో శ్రీనివాసరావు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.